Header Banner

ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!

  Wed May 14, 2025 07:43        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు టీడీపీ కూటమి సర్కారు అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా 2024 అక్టోబర్‌లో ఆరు కొత్త పారిశ్రామిక విధానాలను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. నూతన పారిశ్రామిక విధానాల ద్వారా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు పలుచోట్ల ఎంఎస్ఎంఈ పార్కులను శంకుస్థాపనలు జరుగుతున్నాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ సంస్థలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అందులో భాగంగా ప్రతి సంస్థకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖలపై నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్ల స్థాపనకు ఆసక్తి ప్రదర్శిస్తున్న కంపెనీలు, పెట్టుబడులు గురించి అధికారులతో నారా లోకేష్ చర్చించారు. ఇప్పటి వరకు 91 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు నారా లోకేష్ తెలిపారు. ఈ 91 కంపెనీల ద్వారా రూ.91,839 కోట్ల పెట్టుబడులు, 1,41,407 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని నారా లోకేష్ వెల్లడించారు. ఈ కంపెనీలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని.. సదరు సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో గూగుల్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అలాగే విశాఖపట్నంలో టీసీఎస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇక కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్‌లో సెమీకండక్టర్ పరిశ్రమలతో సహా వివిధ కంపెనీలు పెట్టుబడులు రానున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్, ప్రాసెసింగ్, ఎగుమతులకు హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ఒక ఆక్వా పార్క్ స్థాపనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పొడవైన తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మారిటైమ్ పారిశ్రామిక రంగంలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


ఇది కూడా చదవండిఏపీలో కొత్త ఆర్వోబీ..! ఆ రూట్లోనే.. తీరనున్న దశాబ్ద కల..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradesh #NaraLokesh #APDevelopment #IndustrialGrowth #InvestInAP #MakeInAP